హైదరాబాద్: సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెరిగిది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు కోచ్‌లను దక్షిణ మధ్య రైల్వే (SCR) జోడించింది. ఇప్పటివరకు 14 ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉండగా వాటిని 18కి పెంచారు. దీంతో మొత్తం బోగీల సంఖ్య 20కి చేరింది. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు (20707, 20708) ఉదయం 5.05 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరే రైలు(20708) రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉండే ఈ రైలులో గతంలో కూడా కోచ్‌ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. తాజాగా మరోసారి కోచ్‌లను అదనంగా జోడించారు.