హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 31న గోషామహల్లో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ట్టు సీఎం రేవంత్ తెలిపారు. కొత్త భ వనాల నిర్మాణంపై సీఎం శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించా రు. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల ని అధికారులను ఆదేశించారు. వందే ండ్ల అవసరాలకు తగినట్టుగా ఆధునిక వసతులతో నిర్మాణం ఉండాలని, దవాఖాన భవనాలు, బోధన సిబ్బం ది, విద్యార్థులకు హాస్టళ్ల విషయంలోనూ నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర, సీఎం సలహాదారు నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.