హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జూన్ రెండో వారంలో భూమి పూజ చేయాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఎంతో విలువైన భూములను కేటాయించారని గుర్తుచేశారు.
శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో గౌడ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆత్మగౌరవ భవనం ఆరు అంతస్థుల్లో నిర్మించేందుకు అనుమతులు లభించాయని మంత్రి చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, బాలగోని బాలరాజుగౌడ్, చింతల మల్లేశంగౌడ్, అమరగోని నర్సాగౌడ్, అంబాల నారాయణగౌడ్, అయిలి వెంకన్నగౌడ్, నాచగోని రాజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.