హైదరాబాద్, జూలై 13 (నమస్తేతెలంగాణ): పాలన చేతగాక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక సీఎం రేవంత్‌రెడ్డి హంతకుడి భాష మాట్లాడుతున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతున్న సీఎం భాష రోజురోజుకూ దిగజారుతున్నదని దెప్పిపొడిచారు. ‘ఆయనకు సరుకులేదు..సబ్జెక్ట్ లేదు..’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాటలు విని పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు టీవీలు బంద్‌చేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎంగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా విఫలమైన రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు సహించం: గౌతంప్రసాద్
కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు సహించబోమని గౌతంప్రసాద్ హెచ్చరించారు. కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడగడమే వారు చేసినా నేరమా? అని ప్రశ్నించారు. రేవంత్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.