మార్చి 17 తర్వాత ఉద్యమించుడే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు మార్చి 17లోగా అమలుకాకపోతే ఉద్యమించుడేనని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి హెచ్చరించారు.
- అప్పటిలోగా 420 హామీలు అమలు చేయాల్సిందే
- మంథని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి హెచ్చరిక
మంథని, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు మార్చి 17లోగా అమలుకాకపోతే ఉద్యమించుడేనని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలంటే తెలియని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మంథని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకేసీఆర్ తన పదవీకాలంలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం తప్ప ఎన్నడూ కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపని గొప్ప నాయకుడని కొనియాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూములకు సాగు నీరు అందక బీళ్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్కు నాయకుడు లేక పూటకో పార్టీ తిరిగే రేవంత్రెడ్డిని సీఎంను చేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, 2వ తేదీ దాటినా ఆ ఊసే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలంతా ఇప్పుడు బాధ పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలనను, కేసీఆర్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఇక కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

