హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతికత సమాజానికి ఉపయోగపడాలని, ఇందుకు తగినట్టుగా విద్యార్థులు ముందుకెళ్లాలని మాజీ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు. సాంకేతిక విద్య ప్రపంచవ్యాప్తంగా ఎదురొంటున్న సమస్యలకు పరిషారం చూపుతుందని చెప్పారు. డిగ్రీలు పొందిన విద్యార్థులు నూతన ఆవిషరణలతో ఆకాశమే హద్దుగా పయనించాలని ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ బాసర) 6వ స్నాతకోత్సవాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణితశాస్త్రంలో ఆర్యభట్ట నుంచి చంద్రయాన్ -3, ఆదిత్య-1 వరకు భారతదేశం ప్రపంచానికి విలువైన జ్ఞా నాన్ని అందించిందని చెప్పారు. ఫలితంగా సాంకేతిక రంగంలో దేశం ఉన్నత స్థితిలో ఉన్నదని అన్నారు. పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వృద్ధిలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇక్కడి విద్యార్థుల కు ప్రపంచ స్థాయిలో మార్పును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉందని ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 11 మందికి బం గారు పతకాలు, 160 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, ఆర్జీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.