హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఓఎస్డీ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
బిల్లులు రాక ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు.