హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధర్నాకు మద్దతు ప్రకటించిన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పంచాయతీలను తీర్చిదిద్దిన మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లు బకాయి పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు.పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు మాజీ సర్పంచుల పోరాటానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ మాజీ సర్పంచులు అధైర్య పడవద్దన్నారు. మహాధర్నాకు క్రాం తి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, సర్పంచుల సంఘం స్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్నయాదవ్ తదితరులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, నా యకులు కేశబోయిన మల్లయ్య మెడబోయిన గణేశ్, పూడూరి నవీన్‌గౌడ్, రాజేందర్, అంజయ్యగౌడ్, బొడ్డు నరసింహ, నరే శ్, బీరప్ప, వెంకట్ రామ్‌రెడ్డి, వికారాబాద్ శారద, నవ్య తదితరులు పాల్గొన్నారు.