దంతాలపల్లి, నవంబర్ 24 : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అందించాలని కోరుతూ మాజీ సర్పంచ్ నెహ్రూ నాయక్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించాడు.
గ్రామ అభివృద్ధి పనులకు రూ.5 లక్షలు, బతుకమ్మ ఘాట్ వద్ద విద్యుత్ కనెక్షన్‌కు రూ. లక్ష, బ్లీచింగ్ పౌడర్‌కు రూ. 50 వేలు, జీపీ ట్రాక్టర్ ఈఎంఐలు రూ. రెండు లక్షలు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలు పెట్టి ఉన్నప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలిపారు.