Congress | జగిత్యాల, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘అధికారం ఉన్నా లేకున్నా.. ఎమ్మెల్యే అయినా కాకున్నా.. పదిహేనేండ్ల నుంచి మీ తోటే ఉన్నా.. అన్నాదమ్ముళ్ల లెక్క కలిసి ఉ న్నం.. మీరు ఎమ్మెల్యేగా గెలిచినంక మస్తు తుర్తి అయ్యింది నాకు.. మీరు ఎమ్మెల్యే అయినంక మారిపోయిండ్రు.. ఇప్పుడు మీకు నా తోటి మాట్లాడే తీరికే లేదు.. ఫోన్ చేసినా లేపుతనే లేరు.. రెడ్డీలు చెప్పినట్టే నడుసుకుంటుం డ్రు.. ధర్మపురి నియోజకవర్గంలో రెడ్డి రా జ్యం నడుస్తున్నది. ఇది మంచిగ లేదు అన్నా’ అం టూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలానికి చెంది న ఓ మాజీ సర్పంచ్ సెల్ఫీ వీడియో తీసి ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పంపడంతోపాటు సోషల్ మీడియలో షేర్ చేయగా జిల్లాలో చర్చనీయాంశంగా మారిం ది.
వెల్గటూర్ మం డలం వెంకటాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ రాందేని కోటయ్య దాదాపు ఐదు నిమిషాలకు పైగా ఉన్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సారాంశం.. ‘రెండుసార్లు సర్పంచ్‌గా చేసిన.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా మీతోనే ఉన్న. ఎమ్మెల్యే కాకముందు తమ్మి కోటయ్య ఎక్కడ ఉన్నవ్ అని ఫోన్ చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నియోజకవర్గంలో రెడ్డి వర్గానిదే నడుస్తున్నది. వాళ్లకు భయపడి కావచ్చు.. మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అధికారం లో ఉండి, ప్రజలతో సంబంధాలు ఉన్న బీసీలైన మమ్మల్ని దూరం పెట్టడం కరెక్ట్ కాద న్నా.’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం దుమారాన్ని రేపుతున్నది.