గీసుగొండ, సెప్టెంబర్ 21: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీ అయిన మరియపురం గ్రామ స్వరాజ్ అవార్డుకు ఎంపికైన ట్టు మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపా రు. అక్టోబర్ 17, 18, 19న తిరుపతిలో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి పంచాయతీ రాజ్ సెమినార్‌కు హాజ రు కావాలని ఆహ్వానం అందినట్టు చెప్పారు.
2022-2023లో గ్రామాభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతలో సాధించిన ప్రగతి ఆధారంగా దేశంలో గ్రామ స్వరాజ్‌కు ఎంపికైన ఆరు గ్రామ పంచాయతీల్లో మరియపురం ఉందని పేర్కొన్నారు. ఈ సెమినార్‌కు వివిధ రాష్ర్టాల నుంచి ప్రముఖులు హాజరై అవార్డును బహూకరిస్తారని తెలిపారు.