హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రా? దొంగలశాఖ మంత్రా అని రెడో మాజీ చైర్మన్ వైసతీశ్రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని స్వయంగా పోలీసులే చెప్తున్నారంటే.. ఇక దేశంలో లా అండ్ ఆర్డర్ ఎకడ ఉన్నదని నిలదీశారు. దేశంలో నేరగాళ్లను పట్టుకోవాల్సిన హోంశాఖకు మంత్రిగా ఉండి.. కొడుకునే పరారీ చేశారంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదని పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.