హైదరాబాద్, జూన్ 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ భవన్లో మాజీ ప్రధా ని పీవీ నర్సింహారావు 104వ జయంత్యుత్సవాలను శనివారం ఘనం గా నిర్వహించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు హాజరయ్యా రు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గం అనుసరణీయమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవీప్రసాద్, గజ్జెల నగేశ్, గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొమ్మెర రామ్మూర్తి, దూదిమెట్ల బాలరాజు, కిశోర్‌గౌడ్, సుశీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.