హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొక సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో సైనిక్ సూల్ ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కేంద్ర రక్షణశాఖ మంత్రులను కలిసిన అంశాలను గుర్తుచేశారు.