హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మాజీ ఎంపీ విజయశాంతిని బీజేపీ దూరం పెట్టింది. బీజేపీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి పేరును చేర్చలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది.
ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.