హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఉదయం బంజారాహిల్స్‌లోని వెంగళరావుపార్క్లో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. స్థానిక కార్పొరేటర్ మన్నె కవిత, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధ్దన్‌రెడ్డి, గ్రీన్ చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సంతోష్‌కుమార్ నందినగర్‌లోని నివాసంలో తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. కీసర రామలింగేశ్వరస్వామి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. మాజీ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, సుమిత్రాఆనంద్ తనోబా, పాటిమీది జగన్, చిరుమల్ల రాకేశ్, దూదిమెట్ల బాలరాజు, శుభప్రద్‌పటేల్, మేడె రాజీవ్‌సాగర్, పూర్ణచందర్‌నాయక్, గర్రెపల్లి సతీశ్, శ్రవణ్, రాజు, నారాయణ, షఫీ, సినీనటులు కాదంబరి కిరణ్, జబర్దస్త్ రాకేశ్, జోర్దార్ సుజాత, గాయని వళ్లాల వాణి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా సోదరుడు కేటీఆర్‌ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఇది నిజంగా తనకు గొప్పరోజు అంటూ సంతోష్‌కుమార్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
భగవంతుడి ఆశీస్సులు ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
సంతోష్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం సుఖసంతోషాలతో ఉండాలని, నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
గీతాలాపానతో విద్యార్థినుల శుభాకాంక్షలు
సంతోష్‌కుమార్ జన్మదినం సందర్భంగా పలువురు విద్యార్థినులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ‘పదగతులు.. స్వరజతులు పల్లవించిన నేల.. తేనె తీయని వీణ.. రాగాల తెలంగాణ.. జయగీతికై మోగెరా..’ గీతాపాలన చేశారు. గీతాన్ని సంతోష్‌కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.