హైదరాబాద్, సెప్టెంంబర్ 11 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖ అమరవీరుల స్ఫూర్తిగా అడవులను రక్షించుకుందామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల దినం సందర్భంగా అమరవీరులకు బుధవారం ఆయన నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నా రు.1730 సెప్టెంబర్‌లో బిష్ణోయ్ కమ్యూనిటీ మార్వార్‌లో చెట్లను కాపాడటం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సందర్భాన్ని సంతోష్‌కుమార్ గుర్తుచేశారు. ‘నిరంకుశుడు మరణిస్తాడు.. అతని పాలన ముగుస్తుంది. అమరవీరుడు మరణిస్తాడు.. అతని పాలన ప్రారంభమవుతుంది’ అంటూ తత్వవేత్త కీరెగార్డ్ వ్యా ఖ్యలను ఉటంకిస్తూ సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు.
వరంగల్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ములుగు జిల్లా తాడ్వాయి అటవిలో చెట్లు కూలిపోవడానికి సమాంతర ఉధృత గాలులు (డౌన్ బస్ట్ అండ్ స్ట్రెయిట్ లైన్ విండ్ స్టార్మ్) కారణమని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 28 ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో నౌరాదేహి అభయారణ్యంలో ఇదే తరహాలో చెట్లు భారీగా కూలిపోయాయని వెల్లడించారు.