నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : పంజాగుట్ట పోలీసులకు మరోసారి భంగపాటు ఎదురైంది. స్టేషన్‌హౌస్ అధికారి శోభన్ సమక్షంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అహ్మద్‌ను అరెస్టు చేసి బుధవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఎందుకు అరెస్టు చేశారని అధికారులను మెజిస్ట్రేట్ ప్రశ్నించారు? హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఇవ్వాలని జడ్జి కోరారు. ఉత్తర్వు ప్రతిని న్యాయవాది అందించడంతో రిమాండ్‌కు తరలించకుండా షకీల్ అహ్మద్‌కు బెయిల్ మంజూరు చేస్తూ 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సౌమ్య ఆదేశాలిచ్చారు. రూ.10 వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించి పర్సనల్ బాండ్ అందించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.