డోర్నకల్, జూలై 30 : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి రెడ్యానాయక్ నిలదీశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
అంతకుముందు పట్టణంలో రెండు వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో డీజే పాటలు, కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్చేశారు.