వికారాబాద్, డిసెంబర్ 7 : వికారాబాద్ జిల్లా చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఆయన్ను జైలు నుంచి వికారాబాద్ డీటీసీ సెంటర్‌కు తీసుకొచ్చారు. రెండు రోజులపాటు పోలీస్ కస్టడీలో పట్నం నరేందర్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు. అనంతరం సోమవారం ఉదయం 10 గంటలకు కోర్టులో నరేందర్‌రెడ్డిని హాజరుపరుస్తారని ఆయన తరఫు న్యాయవాది జుక్కల్‌ల లక్ష్మణ్ తెలిపారు.