కొడంగల్, జనవరి 2: సీఎం రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా విఫలమైనట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వికారాబా ద్ జిల్లా దుద్యాల మండలం గౌరారం లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పతకం కేసీఆర్ హయాంలో రూ.27వేల కోట్లతో 70% పైగా పను లు పూర్తి చేశారని గుర్తుచేశారు. మిగిలిన పనులకు రూ10వేల కోట్ల వరకు ఖర్చు చేస్తే పూర్తవుతాయని తెలిపారు. సీఎం రేవంత్ మిగిలిన పనులను చేపట్టకుండా కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరందడం కష్టమని తెలిపారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం పాలూమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను పూర్తి చేసి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. పాల న చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి .. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం ; పంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం
గజ్వేల్, జనవరి 2: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ భవనంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం లకుడారంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డి జన్మదినం సందర్భం గా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం రాత్రి కేక్‌కట్ చేసేందుకు గ్రామ పంచాయతీ ఫర్నిచర్‌ను బయటకు తీసుకొస్తూ కిందపడేశారు. అక్కడే ఉన్న సర్పంచ్ శిల్ప భర్త నర్సింహులుతోపాటు వార్డుసభ్యులు ఎందు కు కిందపడేస్తున్నారని ప్రశ్నించడంతో వారిపై దాడికి యత్నించారు. గ్రామస్తులు జోక్యం చేసుకోవడంతో బూతు లు తిడుతూ తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో కుకునూర్‌పల్లి పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామ పంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పంచ్ శిల్పానర్సింహులు, వార్డు సభ్యులు పోలీసులను కోరారు.