కల్వకుర్తి, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఈ నెల 27న ఉదయం పార్టీ జెండాలను ఎగురవేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించగా జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో మండలానికి ఐదు చొప్పున.. ఏడు మండలాలకు 35 బస్సులు కేటాయించినట్టు తెలిపారు. అదేరోజు ఉదయమే బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో జెండాలు ఎగురవే యాలని కోరారు. అంతకుముందు పార్టీ శ్రేణులతో కలిసి సభ పోస్టర్లను విడుదల చేశారు. ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.