హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): లగచర్లలో రైతుల ఇండ్లపై జరిగిన దాడి రజాకార్లను తలపిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు రజాకార్లు చేసిన అరాచకాలకు రైతులు తిరగబడితే ఏం జరిగిందో చరిత్ర చెప్తుందని, సీఎం రేవంత్రెడ్డి లగచర్లలో ఆ చరిత్రను పునరావృతం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
నమ్మి ఓట్లేసిన సొంత నియోజకవర్గ ప్రజలను రేవంత్రెడ్డి నిరాశ పర్చారని దుయ్యబట్టారు. భూసేకరణ కోసం ఎంతకైనా తెగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.