తప్పుడు కథనాలపై క్షమాపణ చెప్పాలి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంలో భాగంగా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ పత్రిక యాజమాన్యం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల డిమాండ్ చేశారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు.
- మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంలో భాగంగా వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ పత్రిక యాజమాన్యం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల డిమాండ్ చేశారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఫామ్‌హౌస్ 67 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని పేరొన్న నేపథ్యంలో.. 15 టీఎంసీల భారీ నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టును కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే నిర్మించారని, తిరిగి ఆ ఫామ్‌హౌస్ కోసమే నీటిని అందిస్తున్నారని అర్థం వచ్చేలా కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టును ఒక వ్యక్తి ఫామ్‌హౌస్‌తో ముడిపెట్టి చిత్రీకరించడం వాస్తవాలను వక్రీకరించడమేనని మండిపడ్డారు. కొండపోచమ్మసాగర్‌పై ప్రచురించిన వివాదాస్పద కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, సంబంధిత వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

