మహబూబ్‌నగర్ : గత 10 ఏళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud), ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Former MLA Erra Shekhar )అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్ర శేఖర్..సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘మారుతున్న మహబూబ్‌నగర్ ముఖచిత్రం’ పేరిట నియోజకవర్గ అభివృద్ధిపై రచించిన పుస్తకాన్ని మంత్రి శేఖర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధికి చిరునామా ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఘన విజయం సాధించేందుకు, అభివృద్ధికి పట్టం కట్టేందుకు ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందుకు తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారుగుర్తుకు ఓటెయ్యాలన్నారు.