శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 20:03:12

మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత

హైదరాబాద్‌ :  పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 09 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీలకతీతంగా నాయకులు సంతాపం తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.