నార్కట్‌పల్లి, ఆగస్టు 26: రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నార్కట్‌పల్లిలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుండటంతో చిరుమర్తి అక్కడికి వెళ్లి వారికి మద్దతుగా నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్నదాతను గోసపెట్టడం మంచిది కాదని అన్నారు. నెల రోజులుగా రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇలా అయితే రైతులు తిరుగుబాటు చేయడం ఖాయమని హెచ్చరించారు.