కోదాడ, జూలై 12 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ బస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.
కరువు నేపథ్యంలో కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలని విశ్రాంత ఇంజినీర్లు సలహా ఇస్తే.. వారిని జైల్లో వేయాలని అత్యంత దారుణమని మండిపడ్డారు. నాడు కేసీఆర్ రైతులకు సాగునీరు అందించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తే నేడు రైతుల ద్రోహి రేవంత్‌రెడ్డి నీటిని సముద్రం పాల్జేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్న దని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని బొల్లం హెచ్చరించారు.