నాగర్కర్నూల్ : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.(Harshavardhan Reddy) వివరాల్లోకి వెళ్తే..నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సున్నపుతాండకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు(BRS Leader) సీతారాం నాయక్ మంగళవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం బుధవారం సున్నపుతాండ గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మృతుడు సీతారామ నాయక్ మృతదేహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. సీతారామ నాయక్ మృతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ పాడెను(Funeral) మాజీ ఎమ్మెల్యే మోయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తల ప్రతి కష్టంలోనూ తోడుగా అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని చూసి గర్వపడ్డారు.