Harish Rao : తెలంగాణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. బనకచర్ల అంశంలో, కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన రూ.8,929 కోట్లను తెలంగాణ ప్రభుత్వం రాబట్టలేకపోయిందని హరీష్‌రావు విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని అన్నారు. తెలంగాణపై సీఎంకే చిత్తశుద్ధి, దార్శనికత లేదని మండిపడ్డారు.