హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు లండన్ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన లండన్‌లోని కింగ్ హెన్రీస్ రోడ్లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యార్థిదశలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, గ్రేస్ ఇన్‌లో నివసించారు.
ఈ సందర్భంగా అక్కడ అంబేద్కర్‌కు హరీశ్‌రావు నివాళులు అర్పించారు. అంబేద్కర్ వారసత్వం, దార్శనికతను గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాశారు. అంబేద్కర్ ప్రవచించిన సమానత్వం, న్యాయం, సాధికారత ఆదర్శాలు సమ్మిళిత భారతదేశం, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.