హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ముంబైలో అంబేదర్ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశం చైత్యభూమిని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం సందర్శించారు. పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. ముంబై వలసజీవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం ఓబీసీ కులగణన జరిపించాలని, చట్టసభల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముంబై ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.