మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 27 : తమ పాలిట దేవుడు కేసీఆర్ అని దివ్యాంగులు కొనియాడారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్లో బీఆర్ఎస్ నేత నరేశ్-లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
పలువురికి అద్దాలు, మందులు అందజేశారు. దివ్యాంగుడు యాదయ్య మాజీ మంత్రి వద్దకు వెళ్లి.. గత కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులకు పింఛన్ రూ.500 నుంచి రూ.1500 వరకు, 2018లో రూ.3,016 నుంచి రూ.4,116 పెంచిన దేవుడు అని కొనియాడారు.