మహబూబ్‌నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే కక్ష తీర్చుకుంటారా..? ఇదెక్కడి దౌర్జన్యం.. కాంగ్రెస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులుచేస్తే సహించేది లేదు’.. అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్ల బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్‌గౌడ్‌పై జరిగిన కాంగ్రెస్ నేతల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం పార్టీ నేతలు బాధితుడితో కలిసి పాలమూరులోని మాజీ మంత్రి నివాసానికి వచ్చారు. జరిగిన ఘటనను వివరించి గాయాలను చూపించారు. స్పందించిన శ్రీనివాస్‌గౌడ్ పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి.. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.