హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : సీఎం పర్యటన నేపథ్యంలో తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేత లను అరెస్టు చేయడం పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. విపత్తుల సమయంలో పర్యటించని సీఎం, ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రైతుభరోసా ఇవ్వాలని, కల్లాల్లోని ధాన్యం కొనాలని అడుగుతారనే భయంతోనే హెలికాప్టర్లో పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్.. మూడేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి తీయలేదని, ఇప్పుడొచ్చి ఏం ఒరగబెడుతారో చెప్పాలన్నారు. సీఎం పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.