హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో అవస్థలు పడలేక భావిపౌరులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఉయ్యాలవాడ ఘటనను మరువకముందే.. గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరులోని మహాత్మాగాంధీ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల సమస్యల వలయంగా మారిందని ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ గురుకుల విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి రోడ్డుపై బయలుదేరడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్కనారు. తాగునీరు రాక, ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగా లేక బహిర్భూమి కోసం పంట పొలాల్లోకి వెళ్లలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారని తెలిపారు.
నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కితే, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తమ సమస్యల పరిషారం కోసం గురుకుల పాఠశాలల విద్యార్థులు రోడ్లెకుతున్నారని తెలిపారు. సమస్యల పరిషారం కోసం పాదయాత్ర చేస్తున్న బడిపిల్లలను కూడా బెదిరించి, డీసీఎంలో ఎకించి వెనకి తీసుకెళ్లడం కాంగ్రెస్ సరార్ నిర్బంధానికి నిదర్శనమని తూర్పారపట్టారు. సమస్యలతో పుల్లూరు గురుకుల విద్యార్థులు రోడ్డెకడం ఈ ప్రభుత్వ అసమర్థతకు తార్కానంగా నిలుస్తుందని దుయ్యబట్టారు. సమస్యలను గుర్తించి, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిషరించాలని ఆయన డిమాండ్ చేశారు.