మహబూబాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): షాద్నగర్లో దళిత మహిళను కొడుకు ముందే వివస్త్రను చేసి కరశంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మానవ మృగాల్లా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ జడ్పీ కార్యాలయ ఆవరణలో మీడియాతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత 8 నెలల్లో మహిళలపై అత్యాచారాలు, భౌతికదాడులు, దోపిడీలు, హత్యలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇప్పటి వరకు 180 మంది మహిళలపై లైంగికదాడులు, 500 మంది మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు జరిగాయన్నారు. 8 నెలల కాలంలోనే ఇంత జరిగిందంటే రేవంత్రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు.