వనపర్తి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో మే 23న అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ నేత, రైతు శ్రీధర్‌రెడ్డి హత్యకేసులో హంతకులను గుర్తించలేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పెద్దదగడ వద్ద గోదాంలో ఉన్నవేల టన్నుల ప్రభుత్వ ధాన్యం దొంగిలించినా సులో పురోగతి లేదని పేర్కొన్నారు.
ఈ రెండు ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభికి బహిరంగ లేఖ రాశారు. శ్రీధర్‌రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఒకరోజంతా స్వీకరించకుండా తాత్సారం చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ పెద్దల అండదండలతో హత్య జరగడంతోనే పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.