సూర్యాపేట, మే 22 : మాదిగల వాటాను గుంజుకొని పదవులు అనుభవిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ రాష్ర్టానికి పట్టిన చీడ పురుగులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి వివేక్ ఇంట్లోనే మూడు పదవులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. మాదిగ ఓట్లతో అందెలమెక్కిన మంత్రులు నేడు వారినే అణగదొక్కుతున్నారని విమర్శించారు.