సంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ) : తమ పార్టీ నాయకులను వేధిస్తూ రేవంత్‌రెడ్డి పైశాచికానందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వేధింపులకు భయపడేదని లేదని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరా టం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ సోమవారం పరామర్శించారు. ఆయనవెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. జైలులో క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడా రు. కంది సెంట్రల్ జైలును తాను సందర్శించడం ఇది రెండోసారి అని చెప్పారు.
అక్రమ కేసులు బనాయించి లగచర్ల గిరిజనులను కంది జైలులో పెడితే తాను వచ్చి పరామర్శించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి కందిజైలులో పెట్టిందని, క్రిశాంక్‌పై మొత్తం 35 కేసులు నమోదు చేసి జైలులో వేయించిందని చెపా ్పరు. నిర్మల్ కేసులో క్రిశాంక్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పినా అరెస్టు చేసి జైలులో వేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు క్రిశాంక్‌పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన సమయంలో మిస్ ఇంగ్లాండ్‌ను కాంగ్రెస్ నాయకులు వేధించిన విషయాన్ని క్రిశాంక్ బయటపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమో దు చేసిందని, రేవంత్‌రెడ్డి అల్లుడి బినామీ కంపెనీల బాగోతాలను బయటపెట్టినందుకు, రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డికి అమృత్ కాంట్రాక్టు దక్కటం వెనుక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ప్రశ్నించినందుకు, సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతికి రేవంత్‌రెడ్డి సోదరులు కారణమని చెప్పినందుకు క్రిశాంక్‌పై కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. క్రిశాంక్‌పై నమోదు చేసిన తప్పుడు కేసులపై లీగల్‌గా పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రైవేట్ ఆర్మీలా పోలీసులు
రాష్ట్రంలో పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నారని కేటీఆర్ మం డిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నుంచి 12 మంది హ్యాకర్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ ముఖ్యనాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పీ మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, నరహరిరెడ్డి, మఠం భిక్షపతి పాల్గొన్నారు.
జర్నలిస్టులనూ వదలడం లేడు
బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని జర్నలిస్టులను కూడా వదలడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టుల ఫోన్లను అబ్జర్వేషన్లో పెట్టడంతోపాటు తప్పుడు కేసులు బనాయించి జైలులో పెడుతున్నదని మం డిపడ్డారు. రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలో జరుగుతున్న నేరాల అదుపుపై పెడితే బాగుండేదని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై దృష్టి పెట్టకుండా తనపై సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను చూ స్తూ పరువుపోతున్నదని రేవంత్‌రెడ్డి అనుకోవడం దురదృష్టకరమని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమి కోరుకుంటున్నారు? అనేది గ్రహించాలని సూచించారు.
రాష్ట్రంలో పోలీసులు సీఎం రేవంత్‌కు ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నరు. బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీదికి వచ్చి ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నుంచి 12 మంది హ్యాకర్లను తీసుకొచ్చి బీఆర్ఎస్ ముఖ్యనాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నది. రేవంత్‌రెడ్డి ఈ డ్రామాలు వదిలి పాలనపై దృష్టి పెట్టాలి -కేటీఆర్
రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలో జరుగుతున్న నేరాల అదుపుపై పెడితే బాగుండేది. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఇకనైనా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమి కోరుకుంటున్నారు? అనేది సీఎం గ్రహించాలి. బీఆర్ఎస్ నాయకులను వేధించినంత మాత్రాన మా పోరాటం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. -కేటీఆర్