హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఓట్ల సమయంలో తాను ఏనాడూ కౌంటింగ్ హాల్లోకి వెళ్లలేదని, అభివృద్ధి చేతగాక, ప్రజలు ఎకడ ప్రశ్నిస్తారో అన్న భయంతోనే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అసెంబ్లీ వేదికగా తనపై తప్పు డు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వ విప్ అడ్లూరి మాట్లాడుతూ.. దళితబంధు పథకానికి సంబంధించి రూపొందించిన గైడ్‌లైన్స్ సరిగా లేవని, ధర్మపురి నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే వర్తింపజేశారని, 2018లో తన కడుపుకొట్టి కలెక్టర్ సహకారంతో కొప్పుల గెలిచాడని మాట్లాడటాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.