పెద్దపల్లి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం : కాంగ్రెస్ అన్ని వర్గాలకు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం (తెలంగాణ భవన్)లో గురువారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో నిర్వహించిన ధర్మపురి, బుగ్గారం మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరై, ‘బాకీ కార్డు’లను విడుదల చేశారు.
పాలకుర్తి, అక్టోబర్ 9 : రాష్ట్రంలో అధికారం కోసం గ్యారెంటీ కార్డులు, బాండ్ పేపర్లు రాసి ఇచ్చి ఓట్లు వేయించుకున్న రాహుల్‌గాంధీ ఆరు గ్యారెంటీల అమలెక్కడ? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాకీ కార్డులను విడుదల చేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ఢోకా పార్టీ అని ప్రజలందరికీ తెలుసని అన్నారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.