Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
Konda Surekha | మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) క్షమాపణలు(Apologizes) చెప్పారు.
Konda Surekha | మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) క్షమాపణలు(Apologizes) చెప్పారు. కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సి కాదని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. నా వ్యాఖ్యలు కేటీఆర్‌ను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. కాగా, గతంలో అక్కినేని సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై మాజీ మంత్రి కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈనాడు సైతం..!
మరోవైపు ఈనాడు దినపత్రిక సైతం ఇటీవలే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ, ఇచ్చినట్టుగా ఈనాడు దినపత్రిక ఇటీవల తప్పుడు కథనం ప్రచురించింది. దీనిపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో దిగొచ్చిన ఈనా డు యాజమాన్యం.. కేటీఆర్ పాస్‌పోర్టు వ్యవహారంలో తమ పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించినట్టు అంగీకరించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటున తప్పు జరిగిందంటూ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరింది. ఇక ఈ వ్యవహారాన్ని ముగించాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

