హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం పాట పాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని, నిత్యం కేసీఆర్‌ను తలుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని జోగు రామన్న మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కట్టిన భవనాలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని, ఆయన కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ ఏమీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.