Runa Mafi | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎప్పుడో గత డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని బీరాలు పలికి.. ఆ తర్వాత కనిపించిన దేవుళ్లందరి మీదా ఒట్టేసి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల్లోని డొల్లతనాన్ని స్వయంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బయటపెట్టింది. రుణమాఫీ పూర్తయిందని రేవంత్ పదేపదే చెప్తూ వచ్చారు. తాము ఒకే విడతలో రుణమాఫీ పూర్తిచేసినట్టు ప్రకటించుకున్నారు. ఎంతమందికి.. ఎన్ని కో ట్లు మాఫీ చేశామని మాత్రం వెల్లడించలేదు. రుణమాఫీ కాక మనోవేదనతో కొందరు రైతు లు గుండె ఆగి మరణిస్తే, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం చెప్తున్న నిబంధనల ప్రకారం తాము అర్హులమే అయి నా రుణమాఫీ కాలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు ఎంతమేర రుణమాఫీ అయిందో చెప్పాలంటూ మాజీమంత్రి హరీశ్‌రావు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఎస్బీఐని సమాచారం కోరారు. దీనికి ఎస్బీఐ సమగ్ర సమాధానాలు ఇచ్చింది. ఇప్పటివరకు సగంమందికే రుణమాఫీ అయినట్టు పేర్కొంటూ హరీశ్‌రావుకు పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చింది.
హరీశ్‌రావు ఏం కోరారు?
లక్ష కంటే తకువ రుణాలు పొందిన రైతు లు.. లక్ష, లక్షన్నర మధ్య, లక్షన్నర నుంచి 2 లక్షల మధ్య, 2 లక్షలు, అంతకంటే ఎకువ మొత్తంలో రుణాలు పొందిన రైతుల సంఖ్య ఎంత? వారికి అయిన రుణమాఫీ ఎంత? ప్రభుత్వం నిధులు ఎన్ని కేటాయించింది? ఇంకా ఎన్ని నిధులు అవసరం అవుతాయి? వంటి ప్రశ్నలతో దరఖాస్తు చేసుకున్నారు.
హరీశ్‌రావు ప్రశ్న
2024 జూన్ 1 వరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వ్యవసాయ రుణాలు పొందిన రైతుల మొత్తం సంఖ్యను అందించండి.
ఎ- లక్ష కంటే తకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య
బి- రూ.1 లక్ష, రూ.1.5 లక్షల
మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య
సి- 1.5 లక్షల నుంచి 2 లక్షల
మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య
డి- 2 లక్షలు అంతకంటే ఎకువ
రుణాలు పొందిన రైతుల సంఖ్య
ఎస్బీఐ సమాధానం
ఎ- లక్ష కంటే తకువ రుణాలు పొందిన రైతులు సంఖ్య – 5,74,137
బి- లక్ష, 1.5 లక్షల మధ్య రుణాలు
పొందిన రైతుల సంఖ్య – 2,62,341
సి- 1.5 లక్షల, 2 లక్షల మధ్య రుణాలు
పొందిన రైతుల సంఖ్య-1,65,607
డి- 2 లక్షలు, అంతకంటే ఎకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య – 89,373
2వ ప్రశ్న: ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రుణమాఫీ పొందిన రైతుల మొత్తం సంఖ్యను అందించండి.
ఎ- లక్ష కంటే తకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య, మాఫీ అయిన మొత్తం
బి- లక్ష, 1.5 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య, మాఫీ అయిన మొత్తం
సి- 1.5 లక్షల, 2 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య, మాఫీ అయిన మొత్తం
డి- 2 లక్షలు, అంతకంటే ఎకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య. మాఫీ మొత్తం
ఎస్బీఐ సమాధానం
ఎ- లక్ష కంటే తకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య – 2,99,445. మాఫీ మొత్తం:రూ. 1,746,55,15,935
బి- లక్ష, 1.5 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య -1,30,915. మాఫీ మొత్తం: రూ.1,584,60,10,501
సి- 1.5 లక్షల, 2 లక్షల మధ్య రుణాలు పొందిన రైతుల సంఖ్య-65,321, మాఫీ అయిన మొత్తం రూ. 1,093,95,67,128.
డి- 2 లక్షలు, అంతకంటే ఎకువ రుణాలు పొందిన రైతుల సంఖ్య, మాఫీ మొత్తం – ఎలాంటి సమాచారం లేదు.
3 ప్రశ్న: రైతుల వ్యవసాయ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది?
జవాబు: ఎలాంటి సమాచారం లేదు.
4 ప్రశ్న: ఇప్పటివరకు కేటాయించిన మొత్తం నుంచి ఎంత మొత్తం మాఫీ చేయబడింది?
జవాబు: బ్యాంకు వద్ద సమాచారం లేదు.
5 ప్రశ్న: రుణ మాఫీకి ఇంకా ఎంత మొత్తం కావాలి?
జవాబు: తెలియదు, ఎందుకంటే జీవో నిబంధనల ప్రకారం మొత్తం అర్హుల జాబితా బ్యాంక్‌కు అందించలేదు