సంగారెడ్డి : మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)మరోసారి ఇచ్చన మాట నిలబెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి (Sangareddy Dist) జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములును గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే ద్వేషంతో సర్పంచ్, ఆమె కుమారుడు ప్రసాద్ రెడ్డి రాములుకు చెందిన ఇంటిని జేసీబీతో ఈ నెల23వ తేదీన కూల్చివేశారు.
దీంతో తమకు న్యాయం చేయాలని బాధితుడు హరీశ్ రావుతో మొరపెట్టుకున్నారు. స్పందించిన హరీశ్ రావు తనవంతుగా లక్ష రూపాయలను అందజేస్తాని హామీ ఇచ్చారు. కాగా, హరీశ్ రావు అందదించిన నగదును లక్ష రూపాయల నగదును శుక్రవారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చేతుల మీద అందజేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.