Harish Rao | నిరుద్యోగులు సంఘ విద్రోహులా?.. అభ్యర్థుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి: హరీశ్‌రావు
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా, వారిని సంఘ విద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
- ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం
- ఇనుప కంచెలు వేసి.. ముందస్తు అరెస్టులా?
- అణచివేత చర్యలు, బెదిరింపులు సరికాదు
- సీఎంకు మాజీ మంత్రి హరీశ్ బహిరంగ లేఖ
Harish Rao | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా, వారిని సంఘ విద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆదివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.
ఉద్యోగార్థులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార సమావేశం నిర్వహించి, ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదని పేర్కొన్నారు. హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లే నిరుద్యోగుల పోరాటం మొదలైందనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించాలని స్పష్టం చేశారు. ‘మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినవే. రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని ఉద్యోగార్థులు నెత్తీనోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎకువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి, ఇనుపకంచెలు వేసి, ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆఖరికి జర్నలిస్టులనూ బె దిరించడం, అరెస్టు చేయడం, దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అణచివేత చర్యలను ఖండించారు. అకారణంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భేషజాలకు పోవద్దు
నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిషారం లభించదని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన మోతీలాల్, గ్రూప్ 1,2,3 పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
హామీ లు ఇచ్చినవారు పదవుల్లో ఉంటే నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారని ఆయన విమర్శించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగు ల డిమాండ్లపై అవకాశం దొరికిన ప్రతీసారి దీక్ష కు కూర్చున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం కోణంలో చూసే పద్ధతిని వీడాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులు అశాంతితో ఉన్నారని, రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం లేదని పేర్కొన్నారు. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
నోట్దిస్ పాయింట్…సీఎం
- గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కు మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తకువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బందులకు గురై ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉన్నది. కేవలం 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నదని,ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయదా?
- అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మ్యానిఫెస్టోలో ప్ర కటించారు. 25 వేల టీచర్ పోస్టుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. ఆచరణలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. కేసీఆర్ ఇచ్చిన 5వేల పోస్టులకు మరో 6వేలు కలిపి 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డీఎస్సీ నిర్వహించాలి.
- అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే 2 లక్ష ల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొ దటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆర్నేళ్లు దాటి నా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
- రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ. 4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగులకు బకాయిపడిన మొత్తంతో పాటు, నిరుద్యోగ భృతిని క్రమం తప్పకుండా చెల్లించాలి.
- అధికారంలోకి వస్తే జీవో నంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. అధికారంలోకి రాగానే జీవో 46 ప్రకారమే ని యామక ప్రక్రియ పూర్తిచేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిషరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.
మాటమార్చడమే పనిగా పెట్టుకున్నారా?
కేసీఆర్ ప్రభుత్వం 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిందని, వాటికి మరో 60 మాత్రమే చేర్చి 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారని హరీశ్‌రావు వివరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని, ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా కాకుండా అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గ్రూప్ 1 పరీక్ష అనేది యూపీఎస్సీ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదని, రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగిందన్నారు. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆయన వివరించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్స్‌కు 1 :100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన విషయా న్ని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

