Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించు కుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.
తిరుమల: తిరుమల (Tirumala ) శ్రీవారి ఆలయంలో దీపావళి (Diwali ) పర్వదినాన్ని పురస్కరించు కుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, శ్రీరామనవమి, గోకులాష్టమి సందర్భంగా సంవత్సరానికి నాలుగుసార్లు ఆస్థానం నిర్వహిస్తారని తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

