Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో జపాన్ వైద్యరంగం మరో కీలక ముందడుగు వేసింది. మూలకణ చికిత్స ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించే ప్రక్రియలో భాగంగా తొలిసారిగా ఒక రోగికి మెదడులో కణాలను మార్పిడి చేసినట్లు ఈ చికిత్సను అభివృద్ధి చేసిన జపాన్ ఔషధ సంస్థ వెల్లడించింది. దేశంలో ఈ చికిత్సకు షరతులతో కూడిన అనుమతి లభించిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియ చేపట్టడం విశేషం.
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో జపాన్ వైద్యరంగం మరో కీలక ముందడుగు వేసింది. మూలకణ చికిత్స ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించే ప్రక్రియలో భాగంగా తొలిసారిగా ఒక రోగికి మెదడులో కణాలను మార్పిడి చేసినట్లు ఈ చికిత్సను అభివృద్ధి చేసిన జపాన్ ఔషధ సంస్థ వెల్లడించింది. దేశంలో ఈ చికిత్సకు షరతులతో కూడిన అనుమతి లభించిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియ చేపట్టడం విశేషం.
మూలకణాలతో చికిత్స..
సుమిటోమో ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ చికిత్సలో ప్రేరేపిత బహుశక్తి మూలకణాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని వివిధ రకాల కణాలుగా అభివృద్ధి చెందగలిగే సామర్థ్యం కలిగిన కణాలు. ఇప్పటికే ప్రత్యేక విధులు నిర్వహించే పరిపక్వ కణాలను తిరిగి ప్రారంభ దశకు తీసుకురావడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఆరోగ్యవంతమైన దాతల నుంచి సేకరించిన ఈ మూలకణాలను మెదడులో డోపమైన్‌ను ఉత్పత్తి చేసే కణాల పూర్వగాములుగా అభివృద్ధి చేస్తారు. పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారిలో ఈ కణాలు తగ్గిపోతాయి. అనంతరం లక్షల సంఖ్యలో ఈ కణాలను రోగి మెదడులోకి మార్పిడి చేస్తారు. అక్టోబర్‌లో క్యోటో విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో తొలి కణ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు సంస్థ ప్రకటించింది. అయితే, రోగికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.
పార్కిన్సన్స్ అంటే..
పార్కిన్సన్స్ అనేది దీర్ఘకాలికంగా నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి. ముఖ్యంగా శరీర కదలికలపై ప్రభావం చూపుతుంది. చేతులు వణకడం, కదలికల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు లక్షణాలను తగ్గించగలవే తప్ప వ్యాధి పురోగతిని ఆపలేవు లేదా నెమ్మదింపజేయలేవు. ఈ నేపథ్యంలో కొత్త మూలకణ చికిత్సపై ఆశలు పెరుగుతున్నాయి. జపాన్‌లో మార్చిలోనే ఈ చికిత్సకు నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చాయి. అంతకుముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 50 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు రోగులకు మెదడుకు ఇరువైపులా ఐదు లక్షలు లేదా పది లక్షల కణాలను అమర్చారు. రెండేళ్ల పాటు వారిని పరిశీలించగా, తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏవీ కనిపించలేదు. వారిలో నలుగురి వ్యాధి లక్షణాల్లో మెరుగుదల నమోదైంది.
పూర్తి స్థాయిలో అనుమతులు త్వరలోనే..
2029 మార్చి నాటికి మరో 20 నుంచి 30 మంది రోగులకు ఈ కణ మార్పిడి చికిత్స అందించాలని సుమిటోమో ఫార్మా సంస్థ ప్రణాళిక రూపొందించింది. అమెరికాలోనూ దీనిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. రాబోయే ఏడేళ్లలో చికిత్స భద్రత, సమర్థత నిర్ధారణ అయితే జపాన్‌లో పూర్తి స్థాయి అనుమతి లభించే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలోనూ జపాన్ మూలకణ సాంకేతికతను ఉపయోగిస్తోంది. నెల రోజుల క్రితం ఒసాకాలోని ఒక ఆసుపత్రిలో గుండె కండరాల మూలకణాలతో తయారుచేసిన పొరలను ఉపయోగించి ప్రపంచంలోనే తొలిసారిగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ కణాలు కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి, గుండె పనితీరు మెరుగుపడడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. ఆ చికిత్సకూ జపాన్ గత మార్చిలో షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

