US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
US Diwali: సియాటిల్‌లో దీపావళి వేడుకను అతివాదలు అడ్డుకున్నారు. ఫార్ రైట్ కార్యకర్త జేక్ లాంగ్ ఓ కార్యక్రమం వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. డాట్ హెడ్స్‌ను డిపోర్ట్ చేయాలన్నారు. దీన్ని యూఎస్ చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్ ఖండించారు.
న్యూయార్క్: అమెరికాలోని సియాటిల్‌లో దీపావళి(US Diwali) వేడుకను అతివాదులు అడ్డుకున్నారు. అమెరికా ఫార్ రైట్ కార్యకర్త జేక్ లాంగ్, తనతో కలిసిన కొందరు గ్రూపు సభ్యులు .. దీపావళి పండుగ సంబరాలను అడ్డుకున్నారు. కార్యక్రమం వద్ద ప్లకార్డులు పట్టుకున్నారు. డాట్ హెడ్స్‌ను డిపోర్ట్ చేయాలని లాంగ్ ప్లకార్డు ప్రదర్శించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు అతన్ని భౌతికంగా నిలువరించారు. తన ఎక్స్ అకౌంట్లో లాంగ్ కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. హిందువులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లో డెమోక్రటిక్ పార్టీ గెలవడానికి హిందువులే కారణమని ఆయన ఆరోపించారు.
వైట్ రిప్లేస్మెంట్ అనే సంస్థకు లాంగ్ అధిపతిగా ఉన్నారు. అమెరికా క్యాపిటల్ హిల్‌పై 2021 జనవరి ఆరో తేదీన జరిగిన ఘటనలోనూ అతను ఉన్నాడు. నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ట్రంప్ అతనికి క్షమాభిక్ష పెట్టారు. దీంతో అతను 2025లో రిలీజ్ అయ్యాడు. రెండు రోజుల క్రితమే శ్వేత సౌధంలో ట్రంప్ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
లాంగ్ నిరసన ప్రదర్శను చట్టసభల ప్రతినిధి ప్రమీలా జయపాల్ ఖండించారు. జాత్యాంహకార విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. హిందువులకు దీపావళి ముఖ్యమైన వేడుక అని, ఆ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు తాము సేఫ్‌గా ఉన్నట్లు ఫీలవ్వాలని, ఇలాంటి విద్వేషపూరిత నిరసనకు ఈ దేశంలో చోటు లేదని ప్రమీలా ఆరోపించారు.
I am beyond disgusted by this vile and racist display. Diwali is an important holiday and our community should feel safe to celebrate it. This hateful display has no place in our city or this country.
— Rep. Pramila Jayapal (@RepJayapal) November 8, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

